Thursday, August 6, 2009
రెండో భార్య కోసం మతం మార్పు తగదు
న్యూఢిల్లీ: మతం మార్చుకొని రెండో పెళ్లి చేసుకోవాలనుకునే మగవారి ఆటలను కట్టించేందుకు న్యాయ కమిషన్ నడుం బిగించింది. ఇలాంటి వారిని నిరోధించేందుకు.. 1955హిందూ వివాహచట్టంలో '17 ఏ' అనే కొత్త సెక్షన్‌ని జోడించాలని ప్రతిపాదించింది. దీని ప్రకారం.. మొదటి పెళ్లిని చట్ట ప్రకారం రద్దు చేసుకుంటే తప్ప, మతం మార్చుకున్నప్పటికీ మగవారు రెండో పెళ్లి చేసుకోవటానికి వీలుండదు. న్యాయశాఖకు బుధవారం సమర్పించిన తాజా నివేదికలో కమిషన్ ఈ విషయాన్ని పేర్కొంది. దీనిని అరికట్టేందుకే ఈ కొత్త సెక్షన్‌ని జోడించాలని జస్టిస్ ఎ.ఆర్.లక్ష్మణన్ నేతృత్వంలోని కమిషన్ ప్రతిపాదించింది.
Subscribe to:
Posts (Atom)